సుగుణ సుందరి జాడే లేదే పాపం.!

- February 09, 2023 , by Maagulf
సుగుణ సుందరి జాడే లేదే పాపం.!

ఈ ఏడాది సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేర్ వీరయ్య’ అంటూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది శృతి హాసన్. రెండూ పెద్ద సినిమాలు కావడం.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో శృతి హాసన్ గతంలో తాను పోగొట్టుకున్న స్టార్ స్టేటస్‌ని ఈ రెండు సినిమాలతోనూ తిరిగి దక్కించేుకుందనే చెప్పాలి.
అంతా బాగానే వుంది కానీ, ఈ మధ్య శృతి హాసన్ జాడే లేదు. ‘వీర సింహారెడ్డి’ సినిమా కోసం ఎలాగోలా ప్రమోషన్లలో అడపా దడపా కనిపించిన శృతి హాసన్, ‘వాల్తేర్ వీరయ్య’ ప్రమోషన్లలో అస్సలు కనిపించలేదు.
ఆ తర్వాత కూడా ఒక్క ఇంటర్వ్యూలోనూ శృతిహాసన్ సందడి చేసింది లేదు. ‘వీరయ్య’ ఈవెంట్‌లో శృతి హాసన్‌కి హెల్త్ ఇష్యూ అని తెలిసింది. పాపం.! ఆ హెల్త్ ఇష్యూ ఇంకా తగ్గలేదేమో.. అందుకే రాక రాక వచ్చిన ఈ గోల్డెన్ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది శృతి హాసన్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com