భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య కొత్త విమానసర్వీసులు ప్రారంభం

- May 02, 2016 , by Maagulf
భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య కొత్త విమానసర్వీసులు ప్రారంభం

భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య కొత్త విమానసర్వీసులు ప్రారంభం కానున్నాయి. న్యూజిలాండ్‌ పర్యటనలో వున్న భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, న్యూజిలాండ్‌ ప్రధాని జాన్‌ కీల సమక్షంలో భారత మంత్రి సంజయ్‌బాలియాన్‌ న్యూజిలాండ్‌ రవాణాశాఖ మంత్రి సైమన్‌బ్రిడ్జస్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు.* భారత్‌ ఆర్థిక ప్రపంచశక్తిగా ఎదుగుతున్న తరుణంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని జాన్‌ కీ అన్నారు. * ఒప్పందంలో భాగంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కొచ్చి, కోల్‌కతా, ముంబయి, న్యూఢిల్లీ నగరాలకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నారు.* ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ న్యూజిలాండ్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌లు ఈ సర్వీసులను ప్రారంభించనున్నాయి. * గత ఏడాది 52 వేలమంది న్యూజిలాండ్‌ యాత్రికులు భారత్‌కు రాగా భారత్‌ నుంచి 60 వేల మంది న్యూజిలాండ్‌కు వెళ్లారు. * పర్యాటక రంగానికి ఈ కొత్త విమానసర్వీసులు వూతమిస్తాయని నిపుణులు వ్యాఖ్యానించారు. * న్యూజిలాండ్‌లో దాదాపు 1,60,000 వేలమంది భారతీయులు నివసిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com