భారత్-న్యూజిలాండ్‌ల మధ్య కొత్త విమానసర్వీసులు ప్రారంభం
- May 02, 2016
భారత్-న్యూజిలాండ్‌ల మధ్య కొత్త విమానసర్వీసులు ప్రారంభం కానున్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో వున్న భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీల సమక్షంలో భారత మంత్రి సంజయ్బాలియాన్ న్యూజిలాండ్ రవాణాశాఖ మంత్రి సైమన్బ్రిడ్జస్ ఒప్పందంపై సంతకాలు చేశారు.* భారత్ ఆర్థిక ప్రపంచశక్తిగా ఎదుగుతున్న తరుణంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని జాన్ కీ అన్నారు. * ఒప్పందంలో భాగంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబయి, న్యూఢిల్లీ నగరాలకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నారు.* ఎయిర్ ఇండియా, ఎయిర్ న్యూజిలాండ్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లు ఈ సర్వీసులను ప్రారంభించనున్నాయి. * గత ఏడాది 52 వేలమంది న్యూజిలాండ్ యాత్రికులు భారత్‌కు రాగా భారత్ నుంచి 60 వేల మంది న్యూజిలాండ్‌కు వెళ్లారు. * పర్యాటక రంగానికి ఈ కొత్త విమానసర్వీసులు వూతమిస్తాయని నిపుణులు వ్యాఖ్యానించారు. * న్యూజిలాండ్‌లో దాదాపు 1,60,000 వేలమంది భారతీయులు నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







