ఈ వారాంతంలో చలిగాలులు.. హెచ్చరించిన వాతావరణ శాఖ

- February 09, 2023 , by Maagulf
ఈ వారాంతంలో చలిగాలులు.. హెచ్చరించిన వాతావరణ శాఖ

కువైట్: ఈ వారాంతంలో దేశంలో చలిగాలులు వీస్తాయని, సైబీరియన్ హైలాండ్స్ ఎడారి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పడిపోతాయని వాతావరణ శాస్త్రవేత్త ఫహద్ అల్-ఒతైబీ చెప్పారు. శుక్రవారం, శనివారం తెల్లవారుజామున మంచు ఏర్పడే అవకాశం ఉందని, ముఖ్యంగా పొలాలు, ఎడారి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 2 - 5 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని వివరించారు. నివాస ప్రాంతాలలో  ఉష్ణోగ్రతలు 5 నుండి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని, వచ్చే ఆదివారం మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉందని అల్-ఒతైబీ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com