హజ్ రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభం: దరఖాస్తు, ప్యాకేజీల వివరాలు

- February 09, 2023 , by Maagulf
హజ్ రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభం: దరఖాస్తు, ప్యాకేజీల వివరాలు

యూఏఈ: ఈ సంవత్సరం హజ్ చేయాలనుకునే నివాసితులు ఫిబ్రవరి 13 నుండి మార్చి 10 వరకు నమోదు చేసుకోవచ్చని యూఏఈ అధికారులు ప్రకటించారు. నివాసితుల నుండి భారీ డిమాండ్ ఉందని, ఈ నెలాఖరు లోపు రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకోవాలని ప్రజలను హజ్ ఆపరేటర్లు కోరారు. ఈ సారి ఇండియాకు 175,000 కోటాను కేటాయించారు.ఇందులో భారత ప్రభుత్వం కింద 80 శాతం కోటాను,  ప్రైవేట్ హజ్ ఆపరేటర్లకు మిగతా 20 శాతం కోటాను కేటాయిస్తారు. ఎమిరాటీ జాతీయులకు హజ్ చేయడానికి వీసా అవసరం లేదు.. కానీ అనుమతి అవసరం.

ఎంత ఖర్చవుతుందంటే..

మొత్తం తీర్థయాత్ర ప్యాకేజీ జాతీయతలు, పోర్ట్ ఆఫ్ డిపార్చర్ ఆధారంగా మారుతుంది. యూఏఈలోని భారతీయ ప్రవాసుని కోసం హజ్ ప్యాకేజీ సౌకర్యాలు, వసతిని బట్టి Dh30,000 నుండి Dh55,000 వరకు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వ కోటాలో హజ్ చేసే భారతీయులకు దాదాపు Dh15,000 వరకు ఖర్చు అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com