హైదరాబాద్ పై థమన్ కొత్త సాంగ్ అదుర్స్..
- February 10, 2023
హైదరాబాద్: ఇండియాలో మొట్ట మొదటిసారిగా ఈ ఫిబ్రవరి 11న నుంచి కారు రేసింగ్ ని నిర్వహించ బోతున్నారు. అది కూడా మన తెలుగు రాష్ట్రంలోని హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ రేసింగ్ ని హైదరాబాద్ లో జరిపేందుకు కొంత కాలంగా తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అన్ని రకాలుగా ప్రమోషన్స్ చేస్తూ ఈ ఈవెంట్ ని జనాల్లోకి తీసుకు వెళుతున్నారు. మహేష్ బాబు, ప్రభాస్.. ఇలా టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరి చేత ఈ ఈవెంట్ గురించి ప్రమోట్ చేయిస్తున్నారు.
కాగా ఇప్పుడు ప్రజలకి మరింత దగ్గర చేసేలా ఒక పాటని రెడీ చేయించారు. టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ఈ సాంగ్ ని అందించాడు. ఫార్ములా-E హైదరాబాద్ కి వచ్చింది అంటూ సాగే ఈ పాట క్లాసికల్ అండ్ వెస్ట్రన్ టచ్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ తో ఒక మ్యూజికల్ వీడియోని కూడా చిత్రీకరించాడు థమన్. ఈ వీడియోలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ క్యామియో అపిరెన్స్ ఇచ్చి స్టెప్పులు వేసి అదరగొట్టాడు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తరువాత డాన్స్ వేస్తూ కనబడింది ఈ విడియోలోనే, అది కూడా రేసింగ్ ఈవెంట్ కోసం గమనార్హం. దీంతో ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.
కాగా నిన్న (ఫిబ్రవరి 9) రాత్రి ఈ రేసింగ్ ఈవెంట్ కి సంబంధించిన కారిక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర, టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







