రోడ్లపై నిర్లక్ష్య డ్రైవింగ్.. 800 దిర్హామ్‌ల జరిమానా.. పోలీసుల హెచ్చరిక
- February 10, 2023
అబుధాబి: రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, పరధ్యానంలో డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణం కావద్దని వాహనదారులను అబుధాబి పోలీసులు హెచ్చరించారు. రహదారిపై వాహనదారుడు పరధ్యానంలో ఉన్నప్పుడు జరిగే ట్రాఫిక్ ప్రమాదం గురించే తెలిపే వీడియోను కంట్రోల్ అండ్ ఫాలో-అప్ సెంటర్ సహకారంతో అథారిటీ షేర్ చేసింది. డ్రైవింగ్ చేసేటప్పుడు తమ ఫోన్‌ను ఉపయోగించవద్దని వాహనదారులను హెచ్చరించారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో ఇంటర్నెట్లో సర్ఫ్ చేయడం, సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం, కాల్ చేయడం లేదా ఫోటోలు తీయడం లాంటివి చేయవద్దని.. ఇలా ప్రవర్తించడం ప్రమాదాలకు దారితీస్తుందని అధికార యంత్రాంగం తెలిపింది. ఇలాంటి ఉల్లంఘనకు జరిమానా 800 దిర్హామ్‌లు, నాలుగు ట్రాఫిక్ పాయింట్లను విధించనున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







