‘ఖోర్ ఖార్ఫుట్’ ప్రవేశానికి అనుమతి తప్పనిసరి
- February 11, 2023
మస్కట్: ముందస్తు అనుమతి లేకుండా ధోఫర్ గవర్నరేట్‌లోని ఖోర్ ఖార్ఫుట్ ఆర్కియోలాజికల్ రిజర్వ్‌లోకి ప్రవేశించడంపై నిషేధం ఉందని పర్యావరణ అథారిటీ (EA) తెలిపింది. దోఫర్ గవర్నరేట్‌లో ఖోర్ ఖార్ఫుట్ ఆర్కియోలాజికల్ రిజర్వ్‌ను స్థాపించడానికి రాయల్ డిక్రీ నంబర్ (6/2003), రాయల్ డిక్రీ నంబర్ (58/2021) జారీ చేశారు. ఈ రిజర్వ్ ని సహజ నిల్వలు, వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఆధారంగా ఏర్పాటు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా రిజర్వ్‌లోకి ప్రవేశించడం చట్టపరంగా శిక్షార్హమైన ఉల్లంఘన అథారిటీ హెచ్చరించింది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో దోఫర్ గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ద్వారా రిజర్వ్‌లోకి ప్రవేశించడానికి అనుమతులు మంజూరు చేయబడతాయని పేర్కొంది. ఖోర్ ఖర్ఫూట్ ఆర్కియోలాజికల్ రిజర్వ్ అరేబియా సముద్ర తీరంలో ధోఫర్ గవర్నరేట్‌లోని రఖ్యూత్, ధాల్కుట్ విలాయత్ల మధ్య 143.4 కిమీ2 విస్తీర్ణంలో రిజర్వ్ ప్రాంతం విస్తరించి ఉంది .
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







