తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా
- February 11, 2023
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం సచివాలయం ప్రారంబోత్సవాన్ని వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సచివాలయంను ముందుగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజైనా ఫిబ్రవరి 17న ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ప్రారంభోత్సవానికి పలు రాష్ట్రాల సీఎంలు, నాయకులనూ ఆహ్వానించారు. ఇంతలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో సచివాలయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం చెప్పింది. త్వరలోనే కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన తేదీని ప్రకటించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఒక టీచర్, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఫిబ్రవరి 9వ తేదీన విడుదలైంది. ఫిబ్రవరి 16వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి, ఫిబ్రవరి 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆపై ఫిబ్రవరి 27వ తేదీన నామినేషన్ ల ఉపసంహరణ ఉంటుంది.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







