టర్కీలో తప్పిపోయిన సౌదీ మహిళ మృతి

- February 11, 2023 , by Maagulf
టర్కీలో తప్పిపోయిన సౌదీ మహిళ మృతి

అంకారా: టర్కీ, సిరియాలోని అనేక ప్రాంతాలను ధ్వంసం చేసిన వినాశకరమైన భూకంపంలో అదృశ్యమైన సౌదీ మహిళ(51) అంతక్యాలో శవమై కనిపించిందని టర్కీలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. అంకారాలోని రాయబార కార్యాలయంలోని ఛార్జ్ డి'అఫైర్స్ అయిన ముహమ్మద్ అల్-హర్బీ మాట్లాడుతూ.. రెస్క్యూ టీమ్‌లు అంతక్యాలోని కూలిపోయిన నివాస భవనాలలో ఒకదానిలో శిథిలాల కింద తప్పిపోయిన సౌదీ మహిళను గుర్తించినట్లు తెలిపారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లు అల్-హర్బీ వెల్లడించారు. దివంగత సౌదీ మహిళలకు టర్కీలో బంధువులు ఉన్నారని అల్-హర్బీ చెప్పారు. ఆమె కుమార్తెలు తమ తల్లిని టర్కీలోనే ఖననం చేయాలని నిర్ణయించుకున్నారని అల్-హర్బీ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com