120 గంటల తర్వాత చిన్నారిని రక్షించిన ఎమిరాటీ స్క్వాడ్

- February 11, 2023 , by Maagulf
120 గంటల తర్వాత చిన్నారిని రక్షించిన ఎమిరాటీ స్క్వాడ్

యూఏఈ: టర్కీ, సిరియా భూకంపం బాధితులను ఆదుకునేందుకు యూఏఈ చేపట్టిన 'గాలంట్ నైట్/2' ఆపరేషన్‌ విజయవంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా టర్కీలో ఇద్దరు వ్యక్తులను ఎమిరాటీ సెర్చ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్‌లు రక్షించాయి. ఇద్దరిలో ఒకరు 11 ఏళ్ల పిల్లవాడు కాగా, రెండోవారు యాభై నుంచి అరవైల మధ్య వయసున్న వ్యక్తి. కహ్రామన్‌మారాస్‌ ప్రావిన్స్‌లోని దాదాపు 120 గంటలపాటు శిథిలాల మధ్య చిక్కుకున్న ఇద్దరు బాధితులను రక్షించేందుకు ఎమిరాటీ బృందం తీవ్రంగా శ్రమించిందని అధికారులు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వారికి వైద్య నిపుణులు విజయవంతంగా చికిత్స అందించారని, ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నారని ఎమిరాటీ స్క్వాడ్ అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com