టిక్ టాక్ కీలక నిర్ణయం..
- February 11, 2023
భారత్: సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ కీలక నిర్ణయం తీసుకుంది.భారత్ లో మొత్తం సిబ్బందిని తొలగించింది. జాతీయ భద్రత కారణాలతో 2020లో భారత్ లో నిషేధించబడిన టిక్ టాక్ తాజాగా దేశంలో మొత్తం సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. భారత్ లో టిక్ టాక్ కు అత్యధిక యూజర్లు ఉన్నారు. భారత్ నుంచి బ్రెజిల్, దుబాయ్ మార్కెట్లకు పని చేస్తోన్న ఉద్యోగులందరిని టిక్ టాక్ తొలగిస్తుూ నిర్ణయం తీసుకుంది.
భారత్ లో టిక్ టాక్ నిషేధానికి గురైన మూడేళ్ల తర్వాత బైట్ డ్యాన్స్ కు చెందిన సోషల్ మీడియా యాప్ భారత్ లో పని చేస్తున్న ఉద్యోగులందరినీ తొలగించింది. భారత్ లో నిషేధంతో మార్కెట్ వాటాను కోల్పోయినప్పటికీ టిక్ టాక్ ఇప్పటికీ భారత్ లో తన కార్యాలయాన్ని కొనసాగించడం గమనార్హం. భారత కార్యాలయం కేంద్రంగా పని చేస్తున్న ఉద్యోగులు బ్రెజిల్, దుబాయ్ మార్కెట్ల కోసం పని చేస్తున్నారు.
ఇక భారత్ లో తిరిగి కార్యకలాపాలు కొనసాగించేందుకు టిక్ టాక్ ప్రయత్నాలు ఫలించ లేదు. అమెరికాలోనూ యాప్ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. తమ గ్లోబల్, ప్రాంతీయ సేల్స్ టీమ్స్ కు సపోర్టు కోసం 2020లో భారత్ లో ఏర్పాటు చేసిన రిమోట్ సేల్స్ సపోర్టు హబ్ ను మూసివేయాలని నిర్ణయించామని టిక్ టాక్ ప్రతినిధి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







