అన్ని పరిశ్రమల స్టార్ హీరోలు ఒకరి పెళ్ళిలో..
- February 11, 2023
రాజస్థాన్: సెలబ్రిటీలు ఇటీవల వేరే సెలబ్రిటీలు, తెలిసిన వాళ్ళ పెళ్లిళ్లకు, అభిమానుల పెళ్లిళ్లకు వెళ్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. కానీ ఒకే పెళ్ళికి చాలా మంది, అది కూడా అన్ని పరిశ్రమల నుంచి స్టార్ హీరోలు సైతం వచ్చారు. ది వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా మరియు స్టార్ ఇండియా అధ్యక్షుడు కె మాధవన్ కుమారుడు వివాహం తాజాగా రాజస్థాన్ జైపూర్ లోని ఓ కోటలో జరిగింది. ఈ వివాహానికి అన్ని సినీ పరిశ్రమల నుంచి అనేకమంది సెలబ్రిటీలని ఆహ్వానించారు. సినీ, టీవీ రంగానికి చెందిన ప్రముఖుడు కావడంతో చాలా మంది సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరయ్యారు.
అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, మోహన్ లాల్, కమల్ హాసన్, పృథ్విరాజ్ సుకుమారన్, కరణ్ జోహార్.. ఇలా అనేకమంది అన్ని సినీ పరిశ్రమల నుంచి హాజరయ్యారు. వీరంతా సాంప్రదాయ దుస్తుల్లో హంగామా చేశారు. ఇంతమంది స్టార్ హీరోలు ఒకే పెళ్ళిలో కనపడటంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ పెళ్ళిలో సెలబ్రిటీలు డ్యాన్సులు కూడా వేసి సందడి చేశారు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్ కలిసి పంజాబీ డ్యాన్స్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అక్షయ్ ఈ డ్యాన్స్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. మోహన్ లాల్ సర్ మీతో డ్యాన్స్ చేయడం మర్చిపోలేనిది. ఈ మూమెంట్ ని నేను ఎప్పటికి గుర్తుంచుకుంటా అని పోస్ట్ చేశాడు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







