స్పోర్ట్స్ విభాగంలో నెలకు రూ.2 లక్షలకు పైగా జీతంతో కోచ్ ఉద్యోగాలు..
- February 12, 2023
న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఒప్పంద/డిప్యుటేషన్ ప్రాతిపదికన 152 హై-పెర్ఫార్మెన్స్ కోచ్, చీఫ్ కోచ్, సీనియర్ కోచ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్, హాకీ, జూడో, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టి టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, కయాకింగ్ అండ్ కెనోయింగ్, ఖో-ఖో, తైక్వాండో, వాలీబాల్ తదితర స్పోర్ట్స్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఒలింపిక్స్/ప్రపంచ ఛాంపియన్షిప్ విజేత/పారాలింపిక్స్/ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం లేదా ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో నోటిఫికేషన్లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు ఖచ్చితంగా 60 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో మార్చి 3, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నింపిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ మెయిల్‌కు కూడా పంపించవచ్చు. అర్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.56,100ల నుంచి రూ.2,20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.పూర్తి వివరాల కోసం ఈ క్రిందన లింకు క్లిక్ చేయండి.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







