ప్రవాస కార్మికులకు ఆరోగ్యంపై KNPC అవగాహన ప్రచారం

- February 12, 2023 , by Maagulf
ప్రవాస కార్మికులకు ఆరోగ్యంపై KNPC అవగాహన ప్రచారం

కువైట్: ఫహాహీల్ ఇండస్ట్రియల్ ఏరియాలో తమ ప్రవాస కార్మికుల కోసం ప్రాథమిక ఆరోగ్య అవగాహన ప్రచారాన్ని కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ(KNPC) నిర్వహించింది. “ఒకరినొకరు ఆరోగ్యంగా మార్చుకోవడానికి సహకరించుకుందాం” అనే థీమ్ కింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచారానికి KNPC సీఈఓ వధా అల్-ఖతీబ్, కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని వైద్య అత్యవసర విభాగం డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్-షట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులకు ఆరోగ్యకర అలవాట్లు, వ్యాధుల నివారణపై అవగాహన కల్పించడంతో పాటు వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలను కన్సల్టెంట్లు, నిపుణుల ఆధ్వర్యంలో అందించారు. ఫహాహీల్, అహ్మదీ పారిశ్రామిక ప్రాంతాల కార్మికులను ఉద్దేశించి అల్-ఖతీబ్ మాట్లాడుతూ.. ఈ ప్రచారంతో సహా వైద్య అవగాహన కార్యకలాపాలు, ప్రచారాలను నిర్వహించడం తన సామాజిక బాధ్యతగా నిర్వహించడానికి కంపెనీ ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటుందని చెప్పారు. కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com