ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించిన ప్రధాని మోదీ
- February 12, 2023
రాజస్థాన్: దేశానికి తలమానికంగా భావిస్తున్న ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు.రాజస్థాన్‌లోని దౌసాలో కేంద్ర రోడ్డు-రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరితో కలిసి ఈ రోడ్డును ప్రారంభించారు. అయితే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి జైపూర్ వరకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 246 కిలోమీటర్ల రోడ్డు మాత్రమే ప్రారంభమైంది. ఇది ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే మొదటి దశగా చెబుతున్నారు.
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలను లక్ష్యంగా చేసుకునే ఢిల్లీ-జైపూర్ (రాజస్థాన్ రాజధాని) మధ్య ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించినట్లు విమర్శకులు చెబుతున్నారు. ఇక తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్‌ప్రెస్‌వేతో ఢిల్లీ-జైపూర్ మధ్య ప్రయాణ సమయం 5 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గుతుందని అంటున్నారు. ఢిల్లీ-దౌసా (జైపూర్ సమీపం) వరకు నిర్మాణం పూర్తి చేస్తున్న ఈ మొదటి దశకు 12,150 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే విశేషాలేంటో చూద్దామా..
- ముంబై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం పొడవు 1,386 కిలో మీటర్లు
- ఢిల్లీలోని డీఎన్డీ ఫ్లైఓవర్ నుంచి ముంబైలోని జేఎన్పీటీ వరకు విస్తరించి ఉంది
- ఎనిమిది వరుసలతో నిర్మితమవుతున్న దేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌వే ఇదే
- ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు
- ఈ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తైతే ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణ సమయం సగం తగ్గుతుంది. ప్రస్తుతం 24 గంటలుగా ఉన్న ప్రయాణం, 12 గంటలకు తగ్గుతుంది
- ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర (6 రాష్ట్రాలు) రాష్ట్రాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది
- ఈ ఎక్స్‌ప్రెస్‌వే 93 పీఎం గతిశక్తి ఎకనామిక్ నోడ్స్, 13 పోర్టులు, 8 మేజర్ ఎయిర్‌పోర్టులు, 8 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను కలుపుకుని పోతుంది
- వన్యప్రాణుల సంరక్షణ కోసం ఓవర్ పాస్, అండర్ పాసులు నిర్మించిన ఆసియాలోని మొట్టమొదటి ఎక్స్‌ప్రెస్‌వే ఇదే
- దీని కోసం మొత్తంగా 25,000 లక్షల టన్నుల బిటుమెన్ ఉపయోగించారు. అలాగే శిక్షణ పొందిన 4,000 మంది ఇంజనీర్లు పని చేస్తున్నారు
- ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ఏడాదికి 300 మిలియన్ లీటర్ల ఇంధనం, 800 మిలియన్ కిలోగ్రామ్ల కార్బన్ ఆదా అవుతుంది
- ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పుకోవచ్చు. విద్యుత్ వాహనాల రాకపోకలకు అనుగుణంగా దీన్ని తీర్చి దిద్దుతున్నారు
- విద్యుత్ వాహనాల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌వే వెంట అక్కడక్కడ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు
- 120 కిలీమీటర్ల వేగ పరిమితికి అనుమతి ఉంటుంది. దేశంలో అత్యంత వేగవంతమైన రోడ్డు ఇదే
- ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీద హెలిపాడ్లు, ట్రౌమా కేర్ సెంటర్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







