పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం
- February 13, 2023
కేప్ టౌన్: సౌతాఫ్రికా గడ్డ పై జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. తాము ఆడ పిల్లలం కాదు ఆడ పులులం అని నిరూపించారు.చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కు చుక్కలు చూపించారు. దాయాది దేశాన్ని చిత్తు చిత్తుగా ఓడించారు. పాక్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని మరో 7 వికెట్లు, 6 బంతులు మిగిలి ఉండగానే భారత మహిళల జట్టు చేజ్ చేసింది.
ఓపెనర్లు యస్తికా భాటియా (20 బంతుల్లో 17 పరుగులు), షెఫాలీ వర్మ (25 బంతుల్లో 33 పరుగులు) భారత్ కు మంచి శుభారంభం ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన జమియా రోడ్రిగ్స్ అద్భుతంగా ఆడింది. హాఫ్ సెంచరీతో (53*) అదరగొట్టింది. మరో బ్యాట్స్ ఉమెన్ రిచా ఘోష్ కూడా రాణించింది. వరుసగా 3 ఫోర్లు కొట్టి పాక్ పై ఒత్తిడి పెంచింది. రోడ్రిగ్స్ కూడా ఫోర్లు బాది భారత్ ను విజయతీరాలకు చేర్చింది. వీరిద్దరి జోడీ భారత్ విజయంలో కీ రోల్ ప్లే చేసింది.
పాక్ జట్టు కెప్టెన్ బిస్మా మారూఫ్ హాఫ్ సెంచరీతో రాణించింది. 55 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె స్కోరులో 7 ఫోర్లు ఉన్నాయి. చివర్లో ఆయేషా నసీమ్ ధాటిగా ఆడడంతో పాక్ కు ఆ మాత్రమైనా స్కోర్ వచ్చింది. ఆయేషా 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 43 పరుగులు చేసింది.
టీమిండియా బౌలర్లలో రాధా యాదవ్ 2 తీసింది. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీశారు. గ్రూప్ 2లో ఇది నాలుగో మ్యాచ్. కేప్ టౌన్ వేదికగా భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







