టర్కీలో అతిపెద్ద ఫీల్డ్ హాస్పిటల్‌ను ప్రారంభించిన యూఏఈ

- February 14, 2023 , by Maagulf
టర్కీలో అతిపెద్ద ఫీల్డ్ హాస్పిటల్‌ను ప్రారంభించిన యూఏఈ

యూఏఈ: భూకంపంలో తీవ్రంగా నష్టపోయిన టర్కీలో టర్కీలోని గాజియాంటెప్‌లో అతిపెద్ద ఫీల్డ్ హాస్పిటల్‌ను యూఏఈ ప్రారంభించింది. ఆసుపత్రి 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇందులో 50 పడకలు, నాలుగు ICU పడకలు సేవలకు సిద్ధమయ్యాయి. ఇది టర్కీలోని మొదటి (స్థాయి III) ఫీల్డ్ హాస్పిటల్ గా గుర్తింపు పొందింది. యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ ప్రారంభించిన ''గాలంట్ నైట్/2''లో భాగంగా జరిగిన ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి టర్కీలోని యూఏఈ రాయబారి సయీద్ థానీ అల్ ధాహేరి, పలువురు టర్కీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్ ధాహెరి మాట్లాడుతూ.. యూఏఈ నాయకత్వం ఆదేశాల మేరకు ఫీల్డ్ హాస్పిటల్ స్థాపించబడిందన్నారు. ప్రపంచ సంఘర్షణలు, విపత్తులు సమయాల్లో యూఏఈ తన మానవతా బాధ్యతలకు, బాధితులకు అండగా నిలబడాలనే ఆసక్తిని హైలైట్ చేస్తుందని అల్ ధాహెరి చెప్పారు.  రిసెప్షన్, స్క్రీనింగ్, ఎమర్జెన్సీ, సర్జరీ, ఇంటెన్సివ్ కేర్, డెంటిస్ట్రీ, ఎక్స్-రే, లేబొరేటరీ, ఫార్మసీ, ఔట్ పేషెంట్ విభాగాలతో సహా వివిధ విభాగాలు ఆసుపత్రిలో ఉన్నాయని ఎమిరేట్స్ రిలీఫ్ ఫీల్డ్ హాస్పిటల్ కమాండర్ స్టాఫ్ బ్రిగేడియర్ డాక్టర్ అబ్దుల్లా ఖడెమ్ అల్ ఘైతీ తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com