మూడు రకాల టిక్‌లను లాంచ్ చేసిన ట్విటర్
- February 14, 2023
ప్రపంచ వ్యాప్తంగా మూడు రకాల టిక్‌లను ట్విటర్ లాంఛ్ చేసింది. ఇందులో బ్లూ టిక్ కావాలంటే, ఒకవేళ ఉన్న బ్లూ టిక్ కంటిన్యూ కావాలంటే ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా...
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ ను కొనుగోలు చేసిన ఎలోన్ మస్క్, ట్విటర్ లో బ్లూ టిక్ కోసం డబ్బులు చెల్లించాలని ప్రకటించారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వినియోగదారులనుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావటంతో, కొన్నాళ్లవరకు ఈ అంశం తెరవెనుకకు వెళ్ళిపోయింది. కానీ, తాజాగా ట్విటర్, భారత్ లో తన పెయిడ్ బ్లూ టిక్ సర్వీసులను తిరిగి లాంచ్ చేసింది.
మూడు రకాల టిక్ లు:
ప్రపంచ వ్యాప్తంగా మూడు రకాల టిక్ లను ట్విటర్ లాంచ్ చేసింది. ఇందులో బూడిద రంగు టిక్ లను ప్రభుత్వ సంస్థలకు, బ్లూ టిక్ లను వ్యక్తులకు, బంగార వర్ణపు టిక్ లను వ్యాపార సంస్థలకు ఆఫర్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సేవల కోసం నెలకు 8 డాలర్లను, 11 డాలర్లను చెల్లించేలా రెండు రకాల ప్లాన్లను తీసుకొచ్చింది ట్విటర్. ట్వీట్లను ఎడిట్ చేసుకునే సౌకర్యంతో పాటు కొన్ని ప్రత్యేక రకమైన సేవలను కూడా ట్విటర్ అందిస్తోంది. గత డిసెంబర్ లోనే ఈ సేవలకు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. కానీ, ట్విటర్ వీటిని భారత్ లో ప్రస్తుతం లాంచ్ చేసింది.
భారత్ లో నెలకు రూ.650:
భారత్ లో ట్విటర్ యూజర్లు బ్లూ టిక్ సేవలను వాడుకోవాలంటే ప్రతి నెలా రూ.650 చెల్లించాలి. అంటే, మొత్తంగా ప్రతి ఏడాది ఈ సేవల కోసం భారతీయులు రూ.7,800 ఖర్చు చేయాల్సి ఉంటుంది. నెల నెలా కాకుండా ఏడాదికి మొత్తం చెల్లించాలనుకుంటే 12% డిస్కౌంట్ తో రూ.6800 కు ఇయర్లీ ప్లాం అందుబాటులోకి తెచ్చింది. ఇయర్లీ ప్లాం ప్రకారం అయితే, నెలకు షుమారు 566 రూపాయలు ఖర్చు అవుతుంది.
బ్లూ టిక్ ప్రయోజనాలేంటి?
ట్విటర్ కొత్త ప్లాన్ కింద బ్లూ టిక్ వాడుకుంటున్న వ్యక్తులు 50% తక్కువ యాడ్స్ ను చూడచ్చు. దీంతో పాటు ట్విటర్ లో పెద్ద పెద్ద వీడియోలను అప్లోడ్ చేసుకోవచ్చు. ట్వీట్ చేసిన అరగంటలో అయిదు సార్లు ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా ఈ యూసర్లు పొందుతారు. అయితే, ఈ సేవలను ఫోన్లలో వాడుకోవాలంటే, నెలకు రూ.900 చెల్లించాలి.
ప్రస్తుత బ్లూ టిక్ యూసర్ల పరిస్థితేంటి?
ట్విటర్ తెచ్చిన ఈ స్కీం నుంచి ప్రయోజనం పొందాలంటే ముందస్తుగా డబ్బులు చెల్లించాలని న్యూస్ ఏజెన్సీ PTI నివేదించింది. ఇది ప్రీ-పెయిడ్ ప్లాన్. అంటే, ప్రజలు తొలుత డబ్బులు చెల్లించి, ఆ తర్వాత బ్లూ టిక్ లను వాడుకోవాలని ట్విటర్ తెలిపింది. దీంతో పాటు ఈ ప్లాన్ లో ఎలాంటి మనీ-బ్యాక్ సౌకర్యం లేదు. కాల వ్యవధి పూర్తైనతర్వాతనే ఈ ప్లాన్ సుబ్స్క్రిప్షన్ ను ట్విటర్ రెన్యువల్ చేస్తుంది.
ట్విటర్ యూసర్ల నుంచి మిశ్రమ స్పందన:
ట్విటర్ చేసిన ఈ ప్రకటనపై, భారతీయ ట్విటర్ యూసర్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ప్రముఖ మ్యూజిషియన్ అమన్ మాలిక్ ట్వీట్ చేస్తూ "ఇప్పటికే తానూ బ్లూ టిక్ యూసర్ని అని, ఒకవేళ నేను దానికి దరఖాస్తు చేసుకుంటే, తన వెరిఫేయిడ్ బ్యాడ్జి కోల్పోతానని, ఇప్పటికే సబ్స్క్రయిబ్ అయిన దానికి నేనెలా సబ్స్క్రయిబ్ తీసుకోవాలి? పైగా, ఇది కూడా పరిమిత కాలవ్యవధి ఆఫర్. ఎలాన్ మస్క్ ఏం చేయాలకుంటున్నారు?" అని అన్నారు. "డబ్బులు చెల్లించటం ద్వారా బ్లూ టిక్ పొందితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? తనలాంటి జర్నలిస్టులకు నెలకు రూ.900 అనేది చాలా పెద్ద మొత్తం" అని జర్నలిస్ట్ ప్రభాకర్ కుమార్ మిశ్రా అన్నారు. ప్రస్తుతం ఈ ప్లాన్ మీద సోషల్ మీడియా యూజర్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







