బీబీసీ ఆఫీస్‌పై ఐటీ దాడులు..
- February 14, 2023
న్యూఢిల్లీ: దేశంలో గత కొద్దీ నెలలుగా ఐటీ , ఈడీ దాడులు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ , బిజినెస్ , సినీ ఇలా ఎవర్ని కూడా వదలడం లేదు. ఇప్పటికే ఎంతో మంది ఆఫీసులలో, ఇళ్లలో దాడులు జరుగగా..మంగళవారం ఢిల్లీలోని బీబీసీ ఆఫీస్‌పై ఐటీ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా బీబీసీ సిబ్బంది సెల్ఫోన్లు సీజ్ చేశారు ఐటీ అధికారులు. ఇప్పటికే మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఢిల్లీలోని బీబీసీ ఆఫీస్‌పై ఐటీ దాడులు జరగడం చర్చ గా మారింది.
ఇటీవలే భారత్‌లో బీబీసీని నిషేధించాలంటూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇండియా-ద మోదీ క్వశ్చన్ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందంటూ ఈ డాక్యుమెంటరీని ఇప్పటికే కేంద్రం నిషేధించింది. ఈక్రమంలో దేశంలో బీబీసీ, బీబీసీ ఇండియాను బ్యాన్ చేయాలంటూ హిందూ సేన సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిల్‌పై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఒక డాక్యుమెంటరీ దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది.. ఒక ఛానల్‌ను బ్యాన్ చేయాలన్న ఆదేశాలను సుప్రీంకోర్టు ఎలా జారీ చేస్తుంది’’ అంటూ పిటిషన్‌ను కొట్టివేయడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







