భారత్‌లో ‘ఆధార్ మిత్ర’ కొత్త చాట్‌బాట్ వచ్చేసింది..

- February 14, 2023 , by Maagulf
భారత్‌లో ‘ఆధార్ మిత్ర’ కొత్త చాట్‌బాట్ వచ్చేసింది..

న్యూ ఢిల్లీ: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఇటీవలే కొత్త AI బ్యాకప్ చాట్‌బాట్‌ను లాంచ్ చేసింది. దేశ ప్రజలు తమ ఆధార్ సంబంధిత ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ‘ఆధార్ మిత్ర’గా పిలిచే AI/ML-ఆధారిత చాట్‌బాట్ ఆధార్ PVC స్టేటస్ ట్రాక్ చేయడం, ఫిర్యాదులను నమోదు చేయడం, ట్రాక్ చేయడం వంటి ఆధార్ ఆధారిత ప్రశ్నలపై స్పందిస్తుంది.

ఈ కొత్త డిజిటల్ AI చాట్‌బాట్‌కు సంబంధించి UIDAI అధికారిక ట్వీట్ ఇలా చేసింది.. “#ResidentFirst #UIDAI కొత్త AI/ML ఆధారిత చాట్ సపోర్ట్ ఇప్పుడు మెరుగైన రెసిడెంట్ ఇంటరాక్షన్ కోసం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు నివాసితులు #Aadhaar PVC కార్డ్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు. రిజిస్టర్ చేసి ఫిర్యాదులను ట్రాక్ చేయవచ్చు. #AadhaarMitra ద్వారా https://uidai.gov.in/en/. విజిట్ చేయాల్సి ఉంటుంది.

ఈ ట్వీట్‌తో పాటు, UIDAI QR కోడ్‌తో కూడిన పోస్టర్‌ను కూడా ట్యాగ్ చేసింది. భారత్‌లోని నివాసితులు కొత్త ఆధార్ మిత్ర AIని స్కాన్ చేయవచ్చు. QR కోడ్ UIDAI అధికారిక వెబ్‌సైట్‌కి లింక్‌ను కలిగి ఉంది. ఇక్కడ AI చాట్‌బాట్- ఆధార్ మిత్ర యాక్సస్ చేసుకోవచ్చు. ‘UIDAI UIDAI HQ, ప్రాంతీయ కార్యాలయాలు, సాంకేతిక కేంద్రం, కాంటాక్టు కేంద్ర భాగస్వాములతో ఫిర్యాదుల పరిష్కారాన్ని అందిస్తుంది.

ఆధార్ హోల్డర్‌లకు సాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటనలో తెలిపింది. UIDAI క్రమక్రమంగా అధునాతన, ఫ్యూచర్ ఓపెన్-సోర్స్ CRM పరిష్కారాన్ని రూపొందిస్తోంది. కొత్త కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (CRM) సొల్యూషన్ అధునాతన ఫీచర్‌లతో రూపొందించారు. దేశీయ నివాసితులకు UIDAI సర్వీస్ డెలివరీని మెరుగుపరచాలి.ఇంతకీ ఈ ఆధార్ మిత్ర అంటే ఏంటి? మీ ఆధార్ సంబంధిత ప్రశ్నలన్నింటినీ పరిష్కరించడానికి దాన్ని ఎలా ఉపయోగించాలో వివరాలు చూద్దాం.

ఆధార్ మిత్ర అంటే ఏంటి? 
UIDAI కొత్త చాట్‌బాట్ ‘ఆధార్ మిత్ర’ అధికారిక వెబ్‌సైట్ http://www.uidai.gov.inలో అందుబాటులో ఉంది. వెబ్‌సైట్‌లో వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఆధార్ సెంటర్ లొకేషన్, ఎన్‌రోల్‌మెంట్/అప్‌డేట్ స్టేటస్ వెరిఫికేషన్, PVC కార్డ్ ఆర్డర్ స్టేటస్ చెక్, ఫిర్యాదు దాఖలు, ఫిర్యాదు స్టేటస్ చెకింగ్, ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ వంటి ఆధార్‌కు సంబంధించిన వారి విచారణలకు రెస్పాండ్ అయ్యేందుకు ఈ కొత్త చాట్‌బాట్ రూపొందించారు. లొకేషన్, అపాయింట్‌మెంట్ బుకింగ్, వీడియో ఫ్రేమ్ ఇంటిగ్రేషన్, AI చాట్‌బాట్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషలలో అందుబాటులో ఉంది.

ఆధార్ మిత్ర నుంచి ఏది తెలుసుకోవచ్చు? 
ఆధార్ కేంద్రాన్ని గుర్తించడం, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్/అప్‌డేట్ స్టేటస్ చెక్ చేయడం, PVC కార్డ్ ఆర్డర్ స్టేటస్ చెక్ చేయడం, ఫిర్యాదును ఫైల్ చేయడం, ఫిర్యాదు స్టేటస్ చెక్ చేయడం, నమోదు కేంద్రాన్ని గుర్తించడం, అపాయింట్‌మెంట్ బుక్ చేయడం వంటి ఆధార్ సంబంధిత సమాచారాన్ని అడగడానికి ఆధార్ చాట్‌బాట్‌ను ఉపయోగించవచ్చు. చాట్‌బాట్ టెక్స్ట్‌కి ప్రతిస్పందించడంతోపాటు సంబంధిత వీడియోలను చూసే ఫీచర్‌ను అందిస్తుంది. UIDAI ప్రకారం.. చాట్‌బాట్ ఏకకాలంలో ఆధార్ లేటెస్ట్ అప్‌డేట్స్, ఫీచర్లపై ట్రైనింగ్ అందిస్తోంది.

ఆధార్ మిత్రను ఎలా ఉపయోగించాలంటే? 

  • http://www.uidai.gov.in వెబ్‌సైట్ లోకి వెళ్లండి
  • హోమ్‌పేజీలో, కింది కుడి కార్నర్‌లో ‘ఆధార్ మిత్ర’ బాక్స్ కనిపిస్తుంది.
  • చాట్‌బాట్ ఓపెన్ బాక్సుపై Click చేయండి.
  •  మీ ప్రశ్నను అడగడానికి ‘Start’పై నొక్కండి.
  •  మీరు సెర్చ్ బాక్సులో మీ ప్రశ్నను అడగవచ్చు లేదా ఎగువన అందుబాటులో ఉన్న ప్రశ్న ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com