ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ 2023కి సౌదీ అరేబియా ఆతిథ్యం

- February 15, 2023 , by Maagulf
ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ 2023కి సౌదీ అరేబియా ఆతిథ్యం

సౌదీ: ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ 2023కి సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 12-22 తేదీల మధ్య జరుగనుంది. ఈ మేరకు ఫిబ్రవరి 14న జరిగిన ఫిఫా కౌన్సిల్ సమావేశంలో వెల్లడించారు. AFC ఛాంపియన్స్ లీగ్‌లో మొదటిసారిగా ఫైనల్‌కు చేరిన సౌదీ క్లబ్‌ అల్ హిలాల్.. రియల్ మాడ్రిడ్‌తో తలపడిన కొద్ది రోజులకే ఈ ప్రకటన రావడంపై ఫుట్ బాల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఈ సందర్భంగా సౌదీ అరేబియా క్రీడా మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్ ఫైసల్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్‌లు, వారి అభిమానులను సౌదీ అరేబియాకు స్వాగతించే అవకాశం లభించడాన్ని తాము గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. సౌదీలో ఉన్న 35 శాతం అబ్బాయిలు, అమ్మాయిలను ఫుట్ బాల్ క్రీడ దిశగా ప్రేరేపించడానికి దోహదం చేస్తుందన్నారు. ఫుట్‌బాల్ అనేది సౌదీ అరేబియాలో చాలా ఇష్టపడే జాతీయ క్రీడ అని తెలిపారు. 80% మంది జనాభా ఈ ఆటను ఆడతారని, ఎంజాయ్ చేస్తారని వివరించారు. కాగా 2026 AFC ఉమెన్స్ ఆసియా కప్‌ను హోస్ట్ చేయడానికి బిడ్ ప్రక్రియ కొనసాగుతోందని అల్ ఫైసల్ స్పష్టం చేశారు. ఇటీవల ఖతార్ లో జరిగిన FIFA ప్రపంచ కప్ క్వాలిఫికేషన్ మ్యాచుల్లో ఛాంపియన్స్ అర్జెంటినా జట్టుపై సౌదీ అరేబియా చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com