భారత్ లో 150 కోట్ల పెట్టుబడి పెట్టిన కువైట్
- February 15, 2023
కువైట్: గతంలో NIIT టెక్నాలజీస్ అని పిలువబడే ఇండియాస్ కోఫోర్జ్ లిమిటెడ్ 3,90,000 షేర్లను సోమవారం బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా కొనుగోలు చేసినట్లు కువైట్ సావరిన్ వెల్త్ ఫండ్ కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ వెల్లడించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి బల్క్ డీల్స్ డేటా ప్రకారం, కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ కోఫోర్జ్ కంపెనీకి చెందిన 3,90,000 షేర్లను ఒక్కో షేరుకు ₹4,049 చొప్పున కొనుగోలు చేసింది. ఇంతకు ముందు NIIT టెక్నాలజీస్ అని పిలువబడే.. కోఫోర్జ్ లిమిటెడ్ అనేది ఒక గ్లోబల్ డిజిటల్ సర్వీసెస్, సొల్యూషన్స్ ప్రొవైడర్. ఇది మూడవ త్రైమాసికంలో (Q3 FY23)ఊహించిన దాని కంటే మెరుగ్గా రాణించి 24% లాభాన్ని నమోదు చేసింది. క్రితం సంవత్సరం త్రైమాసికంలో దాని నికర లాభం ₹184 కోట్లతో పోలిస్తే ₹228 కోట్లకు పెరిగింది. కంపెనీ FY23 స్థిర కరెన్సీ (CC) ఆదాయ వృద్ధి మార్గదర్శకాన్ని కనీసం 20% నుండి 22%కి పెంచింది. ఈ త్రైమాసికంలో ఐదు పెద్ద డీల్‌లను సాధించినట్లు కోఫోర్జ్ ప్రకటించింది. ఇందులో ఒకటి $50 మిలియన్లకు పైగా ఉన్నదని పేర్కొంది. ఇదిలా ఉండగా.. కోఫోర్జ్ ప్రమోటర్‌గా ఉన్న హాంకాంగ్‌కు చెందిన బేరింగ్స్ పీఈ సోమవారం బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా ఇన్ఫోటెక్ కంపెనీ కోఫోర్జ్‌లో 9.83 శాతం లేదా రూ. 2,430 కోట్ల 60 లక్షల షేర్లను ఉపసంహరించుకుంది.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







