ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 కాయిన్..
- February 15, 2023
న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కనుంది. ఎన్టీఆర్ అందించిన సేవలకు గుర్తుగా.. ఆయన బొమ్మతో రూ.100 కాయిన్ ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది. త్వరలో ఎన్టీఆర్ బొమ్మతో రూ.100ల కాయిన్ రానుంది. కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తిగా వెండితో రూ.100 కాయిన్ తయారు కానుంది. ఈసందర్భంగా మింట్ అధికారులు దగ్గుబాటి పురందేశ్వరిని కలిశారు. నమూనాను చూపించి అధికారులు సలహా కోరారు. పురందేశ్వరికి వారు ఈ వెండినాణేన్ని, దానిపై ఎన్టీఆర్ బొమ్మ మోడల్ ను చూపించారు. ఈ నమూనాకు పురందేశ్వరి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో ఈ రూ.100 నాణెం బయటికి రానుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







