యూఏఈ ట్రావెల్, టూరిజం రంగంలో కొత్తగా 32 వేల ఉద్యోగాలు
- February 15, 2023
యూఏఈ: కోవిడ్-19 ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత యూఏఈ ట్రావెల్ అండ్ టూరిజం పరిశ్రమలో జాబ్ మార్కెట్ మహమ్మారి ముందు స్థాయికి చేరుకుంది. కోవిడ్-19 తర్వాత విదేశీ సందర్శకుల రాక యూఏఈ పర్యాటక పరిశ్రమ పునరుద్ధరణకు గణనీయంగా సహాయపడింది. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ (WTTC) ప్రకారం.. దుబాయ్, అబుధాబిలో ఉద్యోగాల సంఖ్య 2022లో 305,000కి చేరుకోవచ్చని అంచనా వేసింది. ఇది 2021లో ఈ రంగంలో 273,000 ఉపాధి పొందారు. వారితో పోలిస్తే, ఏడాదిలో 32,000 కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారిన దుబాయ్ కు గత రెండు సంవత్సరాలలో అనూహ్యంగా టూరిస్టులు పెరిగారని ట్రిప్యాడ్వైజర్ ట్రావెలర్స్ పేర్కొంది. దుబాయ్ ఎకానమీ అండ్ టూరిజం ప్రకారం.. అంతర్జాతీయ సందర్శకుల సంఖ్య 2022లో 97 శాతం పెరిగి 14.36 మిలియన్లకు చేరుకుంది. యూఏఈలోని నగర గమ్యస్థానాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికుల ఆదరణ పెరుగుతూనే ఉందని WTTC ప్రెసిడెంట్, సీఈఓ జూలియా సింప్సన్ వెల్లడించారు. దుబాయ్ టూరిజం ఖర్చు 2032 నాటికి 46 శాతం పెరిగి దాదాపు $43 బిలియన్లకు (Dh158 బిలియన్లు) చేరుతుందని గ్లోబల్ టూరిజం బాడీ అంచనా వేసింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







