టర్కీ, సిరియా భూకంప బాధితుల కోసం 3 వేల భవనాలు: సౌదీ
- February 15, 2023
రియాద్: టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా నష్టపోయిన వారి కోసం కేఎస్ రిలీఫ్ తాత్కాలిక టెంట్లను అందించగలిగిందని రాయల్ కోర్ట్ సలహాదారు, కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (KSR రిలీఫ్) జనరల్ సూపర్వైజర్ డాక్టర్ అబ్దుల్లా అల్-రబీహ్ తెలిపారు. అలాగే భూకంప బాధితుల కోసం 3,000 తాత్కాలిక భవనాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అల్-ఎఖ్బారియా ఛానెల్లో ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. టర్కీ, సిరియాలో భూకంపం తీవ్ర నష్టం చేసిందని, బాధితుల కోసం నెలల తరబడి సహాయం చేయడం కొనసాగించాల్సిన అవసరం ఉందని డాక్టర్ అల్-రబీహ్ అన్నారు. విపత్తు సంభవించిన వెంటనే భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్న మొదటి దేశాలలో సౌదీ అరేబియా ఒకటన్నారు. ఇప్పటికే భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన టర్కీ, సరియాలకు టన్నుల కొద్ది అత్యవసర పదార్థాలను తరలించామని, త్వరలోనే మరింత సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అక్కడి ప్రభుత్వాలకు ఆర్థిక సహాయాన్ని సౌదీ ప్రకటించిందని అబ్దుల్లా అల్-రబీహ్ గుర్తుచేశారు.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







