ధైరాయిడ్ వేధిస్తోందా.? ఈ సింపుల్ చిట్కా ట్రై చేసి చూడండి.!

- February 15, 2023 , by Maagulf
ధైరాయిడ్ వేధిస్తోందా.? ఈ సింపుల్ చిట్కా ట్రై చేసి చూడండి.!

మహిళల్లో అధికంగా కనిపించే సమస్యల్లో ఒకటి థైరాయిడ్. ఈ సమస్య మహిళల్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఊబకాయం సహా.. అనేక రకాల అనారోగ్య సమస్యలకు థైరాయిడ్ మూల కారణం అని చెప్పొచ్చు.

ధైరాయిడ్ హార్మోన్ ఉండాల్సినంత వుండాలి. ఎక్కువయినా ప్రమాదమే. తక్కువయినా ప్రమాదమే. తక్కువగా రిలీజ్ అయితే ఆ ధైరాయిడ్‌ని హైపో ధైరాయిడిజం అంటారు. ఎక్కువగా ఈ హార్మోన్ ఉత్పత్తి అయితే, దాన్ని హైపర్ ధైరాయిడిజంగా పిలుస్తారు.

దీనికి ఆంగ్లంలో అనేక రకాల మెడిసెన్స్ వున్నాయ్. అయితే, ఆ చికిత్సతో పాటూ, రోజూ ఇంట్లోనే ఈ థైరాయిడ్ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చు. అందుకు పెద్దగా కష్టపడాల్సింది లేదు.

దనియాలతో చేసిన టీని ప్రతీరోజూ తీసుకోవడం వల్ల ధైరాయిడ్ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ఓ గుప్పెడు దనియాలు రాత్రి పూట నానబెట్టి, తెల్లారి ఆ నీటిని మరిగించి వడగట్టి దాంట్లో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com