‘దసరా’ పైనే దిల్ రాజు ఆశలన్నీ.!
- February 15, 2023
ఈ మధ్య ‘వారసుడు’ సినిమాతో గట్టిగా దెబ్బ తినేశాడు నిర్మాత దిల్ రాజు. దాంతో, ఇప్పుడు ‘దసరా’ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని గట్టిగా లాభపడాలని అనుకుంటున్నాడట.
స్పెషల్ స్కెచ్‌తో ముందుకెళుతున్నాడట. నేచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమా పై బజ్ బాగుంది. నాని కూడా పూర్తి నమ్మకంగా వున్నాడు. ప్రచార చిత్రాలకు పాజిటివ్ రెస్పాన్స వస్తోంది. దాంతో, ‘దసరా’ ఓ హిట్ సినిమా అని టీమ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు.
దాంతో, దిల్ రాజు ప్రమోషన్లను వేగవంతం చేశారు. తనదైన శైలిలో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ధియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నారు. అన్నట్లు ఈ సినిమాతో ప్యాన్ ఇండియాపై నాని కన్నేసిన సంగతి తెలిసిందే.
తెలుగుతో పాటూ, తమిళ, కన్నడ తదితర భాషల్లో ఈ సినిమా రిలీజవుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







