ఒమన్ ‘సామాజిక రక్షణ’ చట్టంపై సర్వత్రా హర్షం

- February 16, 2023 , by Maagulf
ఒమన్ ‘సామాజిక రక్షణ’ చట్టంపై సర్వత్రా హర్షం

మస్కట్: సామాజిక రక్షణపై ముసాయిదా చట్టంపై ఒమన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒమన్ కౌన్సిల్‌కు సామాజిక రక్షణపై ముసాయిదా చట్టాన్ని నిన్న మంత్రుల మండలి రిఫరల్ చేసిన విషయం తెలిసిందే. ఒమన్ విజన్ 2040 ప్రకారం ఒమానీ ప్రజల సంక్షేమం కోసం హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అందించిన ప్రత్యేక చొరవను కొత్త చట్టం ప్రతిబింబిస్తుందని అధికారులు తెలిపారు. సామాజిక రక్షణ ముసాయిదా చట్టం సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఒమన్ సుల్తానేట్‌లోని పౌరులు, నివాసితులకు సామాజిక రక్షణ మరియు పదవీ విరమణ ప్రయోజనాలను అందించడాన్ని ప్రతిపాదిస్తుంది. షురా కౌన్సిల్ కార్యాలయ సభ్యుడు జిహాద్ బిన్ అబ్దుల్లా అల్ ఫన్నా అల్ షబీబా రేడియోతో మాట్లాడుతూ.. కొత్త చట్టం ద్వారా ప్రయోజనాలు ఇప్పుడు అర్హులైన వారికి నేరుగా చేరుకుంటాయన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ,  స్వయం ఉపాధి కార్మికులు, హస్తకళాకారులు మరియు తక్కువ-ఆదాయ కుటుంబాల వారు ప్రయోజనాలను అందుకుంటారని పేర్కొన్నారు. ఇది యువకులకు కొత్త అవకాశాలను కూడా కల్పిస్తుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com