సిరియాకు మరో 50 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన యూఏఈ అధ్యక్షుడు

- February 16, 2023 , by Maagulf
సిరియాకు మరో 50 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన యూఏఈ అధ్యక్షుడు

యూఏఈ: సిరియాలో భూకంప బాధిత ప్రజల కోసం అదనంగా $50 మిలియన్ల సహాయాన్ని అందించాలని ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. ఈ మొత్తంలో $20 మిలియన్లను ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల కార్యాలయం (UN OCHA) నిర్వహిస్తున్న అత్యవసర మానవతా ప్రాజెక్టులకు కేటాయించాలని ఆదేశించారు. సిరియాలో భూకంప ప్రభావిత బాధితులకు UAE అదనంగా $50 మిలియన్లు అందించడాన్ని మానవతా వ్యవహారాల అండర్-సెక్రటరీ జనరల్, కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (OCHA) అత్యవసర సహాయ సమన్వయకర్త మార్టిన్ గ్రిఫిత్స్ ప్రశంసించారు. యూఏఈ అధ్యక్షుడు గతంలో సిరియాలో భూకంపాల వల్ల ప్రభావితమైన వారి సహాయానికి $50 మిలియన్లు, టర్కీకి US$50 మిలియన్లు అందించాలని ఆదేశించారు. ఇప్పటివరకు టర్కీ, సిరియాలకు 70 విమానాల ద్వారా సహాయ సామాగ్రిని యూఏఈ పంపించింది. ఇందులో సుమారు 1,243 మెట్రిక్ టన్నుల ఆహారం, వైద్య సహాయం, 2,893 గుడారాలున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో యూఏఈ సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) బృందాలు పనిచేస్తున్నారు.  అంతేకాకుండా టర్కిలోని గాజియాంటెప్‌లోని ఇస్లాహియే జిల్లాలో ఫీల్డ్ హాస్పిటల్ ప్రారంభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com