‘అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్‌’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన యూఏఈ ప్రెసిడెంట్

- February 17, 2023 , by Maagulf
‘అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్‌’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన యూఏఈ ప్రెసిడెంట్

యూఏఈ: అబుధాబిలో అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్‌ను ప్రారంభిస్తున్నట్లు యూఏఈ  అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రకటించారు. ఈ మేరకు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పరస్పర గౌరవం, అవగాహన, వైవిధ్యాన్ని ఉపయోగించుకోవడానికి అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ వేదికగా నిలుస్తుందన్నారు. అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ లో ఒక మస్జీదు, చర్చి, ప్రార్థనా మందిరంతోపాటు అనేక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక ఫోరమ్‌ను కలిగి ఉందన్నారు.

అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ అనేది జుడాయిజం, క్రిస్టియానిటీ మరియు ఇస్లాం మత విలువలకు చిహ్నంగా ఉంటుంది. ఫిబ్రవరి 2019లో పోప్ ఫ్రాన్సిస్, గ్రాండ్ ఇమామ్ అహ్మద్ అల్-తాయెబ్ మానవ సౌభ్రాతృత్వంపై డాక్యుమెంట్‌పై సంతకం చేసిన తర్వాత అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో అన్నిమతాల వారు ప్రార్థనలు చేసే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. దీనితోపాట విద్యా, అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాల వరకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించేలా ప్రత్యేకంగా నిర్మాణం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com