ఒమన్‌లో యూనిఫైడ్ రిటైర్మెంట్ విధానం గురించి తెలుసా?

- February 17, 2023 , by Maagulf
ఒమన్‌లో యూనిఫైడ్ రిటైర్మెంట్ విధానం గురించి తెలుసా?

మస్కట్: ఉద్యోగ హామీల విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య పెద్ద అంతరం ఉందని, ఇది ప్రైవేట్ రంగంలో పని చేయడానికి యువ కార్మికులు విముఖతకు దారితీసిందని జర్నలిస్ట్, ఆర్థిక విశ్లేషకుడు, మిస్టర్ అలీ బిన్ రషీద్ అల్-మతానీ అన్నారు. రెండు రంగాల మధ్య అందించబడిన ప్రయోజనాలు, పదవీ విరమణ తర్వాత హామీలలో చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. కొత్త సామాజిక రక్షణ చట్టం ముసాయిదా పరిష్కరించడానికి, ఆ అంతరాన్ని తగ్గించడానికి, ప్రయోజనాల మధ్య సమానత్వాన్ని సాధించడానికి పని చేస్తుందన్నారు. ఇది ప్రైవేట్ రంగంలో పని చేయడానికి ప్రజలను ఆకర్షిస్తుందని అల్-మతాని చెప్పారు.

సామాజిక రక్షణ వ్యవస్థలో పొదుపు ఎలాగంటే..

ఐచ్ఛిక ప్రావిడెంట్ సిస్టమ్ గురించి అల్-మతానీ వివరించారు. ఈ విధానాన్ని గతంలో కొన్ని కంపెనీలలో 10% నుండి 20% వరకు ప్రావిడెంట్ ఫండ్‌కు బదిలీ చేయడం ద్వారా వర్తింపజేశారని వివరించారు. కంపెనీని విడిచిపెట్టి, రాజీనామా చేసిన తర్వాత లేదా పదవీ విరమణ వయస్సు వచ్చిన తర్వాత, లబ్ధిదారునికి కంపెనీ ఫండ్‌లో సేవ్ చేయబడిన బోనస్‌లు మంజూరు చేయబడతాయి. ఇది గ్లోబల్ సిస్టమ్ మరియు అనేక దేశాలు అలాగే సుల్తానేట్‌లో పనిచేస్తున్న కొన్ని కంపెనీలు అనుసరిస్తున్నాయని తెలిపారు. ఉద్యోగి పదవీ విరమణ తర్వాత లేదా పనిని విడిచిపెట్టిన తర్వాత కొంత మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా సదరు ఉద్యోగి జీవించడానికి అవసరమైన భరోసా లభిస్తుందన్నారు. సామాజిక రక్షణ వ్యవస్థను సమర్థంగా అమలు చేయడం పూర్తి ఫలితాల లక్ష్యాలను అందుకోవచ్చని అల్-మతానీ వివరించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com