అసోంలో భారీ అగ్నిప్రమాదం..150 దుకాణాలు దగ్ధం
- February 17, 2023
అసోంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జోర్ హాట్ లోని చౌక్ బజార్ లో ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో చుట్టుపక్కలా ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల షాపులకు కూడా మంటలు వ్యాపించాయి.
భారీగా అగ్నికిలలు ఎగిసి పడ్డాయి. ఆ ప్రాంతమంతటా దట్టమైన పొగలు అలుముకున్నాయి. మొత్తం 150 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. అగ్నిప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నాయి.
అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు గంటలపాటు కృషి చేశాయి. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిప్రమాద ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







