'స్పైస్ జెట్' విమానంలోనే యోగ క్లాసులు!
- June 19, 2015
అంతర్జాతీయ యోగా దినోత్సవం పుణ్యామని ఒక్కొక్కరికి ఒక్కో రకం ఐడియాలు వస్తున్నాయి. చవక విమానయానాన్ని అందించే ఎయిర్ లైన్స్ సంస్థ స్పైస్ జెట్.. తొలిసారిగా విమాన ప్రయాణికులకు గాల్లోనే యోగా క్లాసులు నిర్వహిస్తోంది. '35 వేల అడుగుల ఎత్తున హై ఆన్ యోగా' అనే పేరుతో స్పైస్ జెట్ కంపెనీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఈనెల 21వ తేదీ ఆదివారం నాడు కొన్ని ఎంపిక చేసిన విమానాల్లో మాత్రమే ఈ ప్రత్యేక క్లాసులు ఉంటాయట. విమానం గాల్లో ఎగిరేటప్పుడు అక్కడే యోగా క్లాసులు పెడుతున్న మొట్టమొదటి సంస్థ ప్రపంచంలో తమదేనని స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. భారతదేశంలో యోగాను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న ఈ కార్యక్రమంలో తాము సైతం భాగస్వాములం అవుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!







