2023లో జీతాలు పెరుగుతాయని నమ్మకంతోఉన్న 70 శాతం ఉద్యోగులు!
- February 18, 2023
యూఏఈ: యూఏఈలో 10 మంది ఉద్యోగుల్లో ఏడుగురు 2023లో ఉద్యోగాలు మారడం ద్వారా వేతనాలు పెరుగుతాయనే నమ్మకంతో ఉన్నారని ఒక అధ్యయనం తెలిపింది. చాలా మంది కార్మికులు తమకు చివరిగా ఒకటి నుండి రెండు సంవత్సరాల క్రితం జీతం పెంచారని చెప్పగా.. 15 శాతం మంది తమ జీతం పెరిగి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం అయిందని తెలిపారు. టైగర్ రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయబడిన ఈ నివేదికలో.. కార్మికులు తమ ప్రస్తుత యజమానితో పెంపుపై చర్చలు జరపడం కంటే 2023లో మెరుగైన వేతనంతో కూడిన కొత్త ఉద్యోగం కోసం వెతకడానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారని నివేదికలో పేర్కొన్నారు.
యూఏఈలో 10 - 38 శాతం మందిలో దాదాపు నలుగురు ఉద్యోగులు తమకు కావలసిన పే చెక్ కోసం తమ ఉద్యోగాలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గత సంవత్సరంలో దాదాపు సగం మంది - 43 శాతం మంది తమ అధికారులతో ఇప్పటికే ఈ విషయం గురించి చర్చించారు. కేవలం 23 శాతం మంది మాత్రమే ఉద్యోగ భద్రత కోసం తమ ప్రస్తుత ఉద్యోగాల్లో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారని, కేవలం 15 శాతం మంది మాత్రమే తమ ప్రస్తుత యజమానితో వేతనాల పెంపుపై చర్చలు జరపాలని యోచిస్తున్నారని అధ్యయనం వెల్లడించింది.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







