అజ్మాన్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురుకి తీవ్ర గాయాలు
- February 18, 2023
యూఏఈ: శుక్రవారం ఉదయం అజ్మాన్లోని ఓ లూబ్రికెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు గాయపడినట్లు అధికారులు ధృవీకరించారు. దుబాయ్, షార్జా మరియు ఉమ్ అల్ క్వైన్తో సహా నాలుగు ఎమిరేట్లకు చెందిన సివిల్ డిఫెన్స్ బృందాలు ఏడు నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చాయి. అత్యవసర ప్రతిస్పందన బృందాలు చుట్టుపక్కల ప్రాంతాల నివాసితులను ఖాళీ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదంలో గాయపడ్డ ఐదుగురిని షేక్ ఖలీఫా ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీ, ప్రింటింగ్ ప్రెస్, రెడీమేడ్ బట్టల గోదాము, తొమ్మిది వాణిజ్య దుకాణాలు దగ్ధమైనట్లు అజ్మాన్ అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీ పక్కన పార్క్ చేసిన 39 కార్లు దగ్ధం అయినట్లు అధికారులు తెలిపారు.
అజ్మాన్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్-జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నుయిమి మాట్లాడుతూ.. ఎమిరేట్స్ న్యూ ఇండస్ట్రియల్ ఏరియాలో తెల్లవారుజామున 3.15 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని తమకు సమాచారం అందిందని చెప్పారు. మంటల స్థాయిని పరిగణనలోకి తీసుకుని పొరుగున ఉన్న ఎమిరేట్స్ దుబాయ్, షార్జా, ఉమ్ అల్ క్వైన్ మరియు అజ్మాన్లలోని అగ్నిమాపక కేంద్రాల నుండి సహాయాన్ని అభ్యర్థించినట్లు పేర్కొన్నారు. యూనియన్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కంపెనీ, మున్సిపాలిటీ మరియు ప్లానింగ్ డిపార్ట్మెంట్, రెడ్ క్రెసెంట్ కూడా అత్యవసర ప్రతిస్పందన బృందాలను పంపాయని తెలిపారు.
మరోపక్క ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీలో శీతలీకరణ కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ కల్నల్ రేద్ ఒబైద్ అల్ జాబీ తెలిపారు. సంఘటనా స్థలంలో ఉన్న ఉన్నత అధికారులలో కమాండర్-ఇన్-చీఫ్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, మేజర్-జనరల్ డాక్టర్ జాసిమ్ ముహమ్మద్ అల్ మర్జౌకి సమీక్షించారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







