'బిగ్గెస్ట్ మండి ప్లేట్' ను ప్రారంభించిన సోనూ సూద్
- February 18, 2023
హైదరాబాద్: భోజన ప్రియులుకు నోరూరించే వంటకాల రుచులను ఆతిధ్యం అందిస్తున్న "జిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్" అందరి మన్ననలు పొందుతూ దినదినాభివృద్ధి చెందుతున్న విషయం మనందరికీ తెలిసిందే.. తాజాగా కొండాపూర్ సర్కిల్ లో ఉన్న "జిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్" లో ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేట్ లంచ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన నటుడు సోనూ సూద్ ఈ బిగ్గెస్ట్ ప్లేట్ ను గ్రాండ్ గా లాంచ్ చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమం లో నటి హిమజ, ఇన్స్టాగ్రామర్ పద్దు పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం నటుడు సోనూ సూద్ మాట్లాడుతూ.. విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుండడం చాలా సంతోషంగా ఉంది. భోజన ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుచులను అందించేందుకు జిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్ వారు వినూత్నంగా ఇప్పటి వరకు ఎవరూ ఆలోచించని విధంగా ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేట్ లంచ్ ఏర్పాటు చెయడం అభినందనీయమని అన్నారు.
జిస్మత్ మండి నిర్వాహకులు మాట్లాడుతూ..అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మా జిస్మత్ లో ఇండియా లో అతి పెద్దదైన సోనూ సూద్ ప్లేట్ ను ఇంట్రడ్యూజ్ చేయడానికి ప్లాన్ చేయగా మేము అడిగిన వెంటనే సోనూ సూద్ గారు ఎంతో పెద్ద మనసు చేసుకొని మా రెస్టారెంట్ కు వచ్చి లాంచ్ చేసినందుకు వారికి మా ధన్యవాదములు. సోనూ సూద్ హార్ట్ ఎంత పెద్దదో మేము ప్రారంభిస్తున్న సోనూ సూద్ బిగ్గెస్ట్ ప్లేట్ మండి అంతే పెద్దది..ఇది మా రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్స్ నుండి ఫీడ్ బ్యాక్ తీసుకొని బిగ్గెస్ట్ ప్లేట్ స్టార్ట్ చేయడం జరిగింది.దీనికి భోజన ప్రియుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇండియాలో ఇది బిగ్గెస్ట్ మండి ప్లేట్. 8 ఫీట్ డయామీటర్ తో ఒకే సారి 15 నుండి 20 మెంబెర్స్ కూర్చొని తినవచ్చు. దీంట్లో చికెన్, మటన్ ఆన్ లిమిటెడ్.ధరలు కూడా అందరికీ అందుబాటులోనే ఉంటాయి.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, వైజాగ్, నెల్లూరులో, బెంగుళూరు లలో బ్రాంచీలు కలిగిన తమ 'జిస్మత్ మండి' త్వరలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనేక నగరాల్లో బ్రాంచిలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







