టర్కీ భూకంప శిథిలాల్లో దొరికిన ఫుట్‌బాలర్ క్రిస్టియన్ అట్సు మృతదేహం
- February 18, 2023
యూఏఈ: టర్కీలో భారీ భూకంపం తర్వాత కుప్పకూలిన భవన శిథిలాల కింద ఘనా మాజీ అంతర్జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియన్ అట్సు(31) మృతదేహం గుర్తించినట్లు స్థానిక మీడియా నివేదించింది. భూకంపం సంభవించిన ఒక రోజు తర్వాత అతడిని సహాయక బృందాలు రక్షించాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అతని మృతదేహాన్ని శిథిలాల కింద గుర్తించడంతో అవన్ని తప్పుడు వార్తలు అని తేలింది. టర్కీలోని అతని మేనేజర్ మురత్ ఉజున్‌మెహ్మెట్ మాట్లాడుతూ.. టర్కీ దక్షిణ ప్రావిన్స్ హటేలో శిథిలాల కింద అతని మృతదేహాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. మిడ్‌ఫీల్డర్ అట్సు 2017లో న్యూకాజిల్‌కు రాకముందు చెల్సియాలో నాలుగు సీజన్లు ఆడారు. అతను టర్కిష్ సూపర్ లిగ్ సైడ్ హటేస్పోర్ కోసం సెప్టెంబర్‌లో కుదిరిన ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. సెర్చ్ అండ్ రెస్క్యూ వర్కర్లు అట్సు మృతదేహాన్ని రోనేసన్స్ రెసిడెన్స్‌లో కనుగొన్నారు. ఇది హటేలోని అంటక్య నగరంలో కూలిపోయిన ఎత్తైన విలాసవంతమైన ఫ్లాట్ల బ్లాక్. గత వారం ఈ భవనాల కాంట్రాక్టర్ మోంటెనెగ్రోకు వెళ్తుండగా ఇస్తాంబుల్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసినట్లు టర్కీ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







