వచ్చే ఏడాది అబుధాబిలో ఐఐటీ క్యాంపస్
- February 18, 2023
యూఏఈ: భారతదేశ ప్రఖ్యాత కళాశాల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) వచ్చే ఏడాది అబుధాబిలో తన మొదటి విదేశీ క్యాంపస్‌ను ప్రారంభించనుంది. ఈ మేరకు యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ వెల్లడించారు. వచ్చే సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌లో IIT ఢిల్లీకి చెందిన ఉన్నత స్థాయి బృందం యూఏఈ రాజధాని పర్యటనను సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ అబుధాబి (ADEK) అధికారులతో దీని గురించి విస్తృతంగా చర్చలు జరిపింది. ప్రస్తుతం భారతదేశంలో 23 IITలు ఉన్నాయి. ఇవి దేశంలోని వివిధ ప్రాంతాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు డాక్టరేట్ స్థాయి కార్యక్రమాలను అందిస్తున్నాయి. ఈ సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, భారతీయ పారిశ్రామికవేత్త NR నారాయణ మూర్తి వంటి ఎందరో ప్రముఖులు ఐఐటీలలోనే చదువుకున్నారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







