తారకరత్న మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి
- February 19, 2023
హైదరాబాద్: తారకరత్న మృతి పట్ల వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేసారు. తారకరత్న వయసు 40 ఏళ్లు. ఆయనకు భార్య అలేఖ్య రెడ్డి, కుమార్తె నిషిక ఉన్నారు. తారకరత్నది ప్రేమ వివాహం. అలేఖ్య వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువుల అమ్మాయి. అలేఖ్య టాలీవుడ్ లో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసేది. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అప్పట్లో కొద్దిమంది సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.
అప్పటి నుండి తారకరత్న విజయసాయి కి దగ్గరగానే ఉన్నాడు. కాగా 23 రోజుల క్రితం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆయన్ను కుప్పం లోని హాస్పటల్ కు తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్ కు తరలించారు. అప్పటి నుండి తారకరత్న కు చికిత్స అందజేస్తూ వస్తున్నారు. తారకరత్న క్షేమంగా తిరిగిరావాలని యావత్ నందమూరి అభిమానులు , ప్రజలు కోరుకుంటూ దేవుడ్ని ప్రార్ధించారు. కానీ దేవుడు కనికరించలేదు. మహాశివరాత్రి నాడే తారకరత్న కన్నుమూశారు. తారకరత్న మరణ వార్త ఎవ్వరు తట్టుకోలేకపోతున్నారు. సినీ , రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
తారకరత్న మృతి పట్ల వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి విజయసాయిరెడ్డి బంధువు అని తెలిసిందే. తారకరత్న సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నామని విజయసాయి వెల్లడించారు. కానీ విధి మరోలా తలచిందని విచారం వ్యక్తం చేశారు.
నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నానంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తారకరత్న అభిమానులకు ప్రగాఢ సానభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









