Dh2.5 మిలియన్ల సిగరెట్ బాక్సుల చోరీ.. తొమ్మిది మందికి జైలు, జరిమానా
- February 20, 2023
దుబాయ్: అల్ ఖుసైస్‌లోని ఓ గిడ్డంగి నుంచి తొమ్మిది మంది వ్యక్తుల ముఠా 2.25 మిలియన్ దిర్హామ్‌ల విలువైన 375 సిగరెట్లను దొంగిలించారు. దుబాయ్ క్రిమినల్ కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అందులోని ప్రధాన నిందితులైన ఇద్దరికి దొంగిలించిన మొత్తం విలువను జరిమానాగా విధించారు. శిక్ష అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. పోలీసుల కథనం ప్రకారం.. పొగాకు వ్యాపార సంస్థ డైరెక్టర్ తన కంపెనీ గోదాములో చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. గోదాం వద్దకు వచ్చేసరికి మెయిన్ డోర్ పగులగొట్టి ఉందని బాధితుడు తెలిపాడు. ఆ తర్వాత గోదాంలో నుంచి 375 సిగరెట్ల పెట్టెలు చోరీకి గురైనట్లు గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీఐడీ బృందం నేరస్థలాన్ని పరిశీలించి అనుమానితులను విచారించింది. అల్ అవీర్‌లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసే వినియోగదారులకు రిటైల్ అమ్మకం కోసం సిగరెట్లను అందజేస్తుండగా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. చోరీకి గురైన వస్తువులు అల్ అవీర్‌లోని గోదాములో ఉంచినట్లు తొమ్మిది మంది దోషుల్లో ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. అధికార దాడిని చేసి బాక్సులతోపాటు మిగిలిన ముఠా సభ్యులను అరెస్టు చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







