ఫిలిం ఛాంబర్ లో తారకరత్న భౌతికకాయం
- February 20, 2023
హైదరాబాద్: తారకరత్న భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలించారు. శనివారం తారకరత్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత నెలలో ఈయన గుండెపోటుకు గురికావడం తో బెంగుళూర్ లోని నారాయణ హృదయాల హాస్పటల్ కు తరలించారు. అప్పటి నుండి కోమాలోనే ఉండిపోయారు. విదేశీ డాక్టర్స్ సైతం తారకరత్న ఆరోగ్యం కుదుటపడేలా తీవ్రంగా శ్రమించారు కానీ కుదరలేదు. దాదాపు 24 రోజులపాటు చికిత్స అందించారు. కానీ తారకరత్న ను బ్రతికించలేకపోయారు.
చివరకు ఫిబ్రవరి 18 మహాశివరాత్రి రోజున కన్నుమూశారు. ఆ తర్వాత బెంగుళూర్ నుండి ఆయన భౌతికాయాన్ని హైదరాబాద్ లోని మోకిలాలోని తారకరత్న నివాసానికి తరలించారు. తారకరత్న ను కడసారి చూసేందుకు సినీ , రాజకీయ ప్రముఖులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళ్లు అర్పించారు. కొద్దిసేపటి క్రితం ఫ్రీజర్ నుంచి తారకరత్న దేహాన్ని బయటకు తీసి ఆయన కుమారుడి చేతుల మీదుగా ప్రక్రియ పూర్తి చేశారు. ఇంటినుంచి తారకరత్న భౌతికకాయాన్ని ఫిలం ఛాంబర్ కు తరలిస్తున్నారు. కాసపేట్లో ఫిలిం ఛాంబర్ కు ఆయన భౌతికకాయం చేరుకోనుంది. అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో ఉంచనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరపనున్నారు.
ఇక తారకరత్న మరణంతో ఆయన భార్య, పిల్లలు ఒంటరి వారైపోయారు. దీంతో వారి విషయంలో నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారట. తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యత తాను తీసుకుంటానని.. తారక్ కుటుంబానికి నిత్యం అండగా ఉండానని భరోసా ఇచ్చారట.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







