తారకరత్న అంత్యక్రియలు పూర్తి..

- February 20, 2023 , by Maagulf
తారకరత్న అంత్యక్రియలు పూర్తి..

హైదరాబాద్:  సీని నటుడు నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్‌ ఛాంబర్‌ నుంచి మహాప్రస్థానం వరకు తారకరత్న అంతిమయాత్ర జరిగింది. జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో తారకరత్న పార్థివ దేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.

అనంతరం మహా ప్రస్థానంలో ఆయన పార్థివదేహానికి ఆయన తండ్రి మోహన్ కృష్ణ తలకొరివి పెట్టారు. తారకరత్నకు ఒక కుమారుడు.. అతని వయస్సు మూడేళ్లు. కుమారుడు చిన్నవాడు కావడంతో తారకరత్న అంత్యక్రియలు ఆయన తండ్రినే నిర్వహించారు. నందమూరి అభిమానులు, నందమూరి కుటుంబంతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 25 రోజుల క్రితం నారా లోకేష్ పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు తారకరత్న. అలా హాస్పిటల్ లోపలి వెళ్లిన ఆయన మళ్లీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు.

తారకరత్న కోలుకొని బయటికి రావాలని అభిమానులు దేవుడ్ని ప్రార్దించిన విషయం తెల్సిందే. అయినా దేవుడు వారి ప్రార్థనలను వినలేదు.. అతి చిన్న వయస్సులోనే తారకరత్నను మృత్యువు కబళించింది. ఇక తారకరత్నకు గుండెపోటు వచ్చిన దగ్గరనుంచి.. అంత్యక్రియలు నిర్వహించేవరకు అన్ని తానే అయ్యి చూసుకుంటున్నాడు బాలకృష్ణ. తన అన్న మోహన్ కృష్ణ పక్కనే ఉండి.. తారకరత్నకు అంత్యక్రియలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com