కువైట్ మొదటి వైద్య పరిశోధన, ఆవిష్కరణ కేంద్రం ప్రారంభం
- February 20, 2023
కువైట్: సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ను ప్రారంభిస్తున్నట్లు జాబర్ హాస్పిటల్లోని సర్జికల్ విభాగం ప్రకటించింది. ఈ తరహా రిసెర్చ్ సెంటర్ కువైట్ మరియు రీజియన్లో మొదటిదని పేర్కొంది. జాబర్ హాస్పిటల్లోని సర్జరీ విభాగాధిపతి, కువైట్ బోర్డ్ ఆఫ్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ సులైమాన్ అల్-మజీదీ మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన మార్గంలో సహాయం చేయడానికి వైద్యులకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. గతంలో వైద్యం కేవలం వైద్యుల అనుభవంపై ఆధారపడి ఉండేదని, కానీ నేడు ఇది చికిత్స విధానంలో అనేక మాప్పులు వచ్చాయన్నారు. జాబర్ హాస్పిటల్లో అభివృద్ధి పనులకు తోడ్పాటునందించడంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ పాత్రను మెజీదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి, అండర్ సెక్రటరీ డాక్టర్ ముస్తఫా రెధాకు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







