కువైట్ మొదటి వైద్య పరిశోధన, ఆవిష్కరణ కేంద్రం ప్రారంభం

- February 20, 2023 , by Maagulf
కువైట్ మొదటి వైద్య పరిశోధన, ఆవిష్కరణ కేంద్రం ప్రారంభం

కువైట్: సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు జాబర్ హాస్పిటల్‌లోని సర్జికల్ విభాగం ప్రకటించింది.  ఈ తరహా రిసెర్చ్ సెంటర్ కువైట్ మరియు రీజియన్‌లో మొదటిదని పేర్కొంది. జాబర్ హాస్పిటల్‌లోని సర్జరీ విభాగాధిపతి, కువైట్ బోర్డ్ ఆఫ్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ సులైమాన్ అల్-మజీదీ మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన మార్గంలో సహాయం చేయడానికి వైద్యులకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. గతంలో వైద్యం కేవలం వైద్యుల అనుభవంపై ఆధారపడి ఉండేదని,  కానీ నేడు ఇది చికిత్స విధానంలో అనేక మాప్పులు వచ్చాయన్నారు. జాబర్ హాస్పిటల్‌లో అభివృద్ధి పనులకు తోడ్పాటునందించడంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ పాత్రను మెజీదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి, అండర్ సెక్రటరీ డాక్టర్ ముస్తఫా రెధాకు ధన్యవాదాలు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com