టర్కీలో ముగిసిన యూఏఈ ‘గాలంట్ నైట్-2’ ఆపరేషన్
- February 20, 2023
యూఏఈ: టర్కీలో "గాలంట్ నైట్ - 2" ఆపరేషన్‌లో భాగంగా సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్‌లను పూర్తి చేసినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ ప్రకటించింది. టర్కిష్ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ (AFAD) శోధన, రెస్క్యూ కార్యకలాపాలను పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఎమిరాటీ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ టర్కీలో వరుసగా 14 రోజులు పనిచేసిన తర్వాత ఈరోజు స్వదేశానికి తిరిగి రానుంది. "గ్యాలంట్ నైట్-2" ఆపరేషన్ యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు నిర్వహించారు. టర్కీ ప్రభుత్వం తరపున డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిజాస్టర్ రెస్పాన్స్, చాలా క్లిష్ట సమయంలో సత్వర స్పందన, విశేషమైన సహాయానికి ఎమిరాటీ బృందానికి తన కృతజ్ఞతలు తెలియజేశారు. టర్కీలో కార్యకలాపాలను ముగించినట్లు ప్రకటించిన తర్వాత టర్కీని విడిచిపెట్టిన చివరి అంతర్జాతీయ రెస్క్యూ బృందం యూఏఈ అయింది. ఈ బృందం పది మందిని రక్షించడంతోపాటు 26 మంది మృతదేహాలను భూకంప శిథిలాల నుంచి వెలికితీయడంలో విజయం సాధించింది.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







