‘కస్టడీ’ కోసం సమ్మర్‌ని లాక్ చేసిన నాగ చైతన్య.!

- February 20, 2023 , by Maagulf
‘కస్టడీ’ కోసం సమ్మర్‌ని లాక్ చేసిన నాగ చైతన్య.!

అక్కినేని హీరో నాగ చైతన్య ఈ మధ్య వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి అత్యంత యాక్టివ్‌గా వున్న హీరోగా చైతూను చెప్పుకోవచ్చు. గతేడాది ‘లవ్ స్టోరీ’ , ‘బంగార్రాజు’, ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలతో సందడి చేశాడు.
ఈ ఏడాది ‘కస్టడీ’ సినిమాని సిద్ధం చేస్తున్నాడు. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘కస్టడీ’ రూపొందుతోంది. మాస్ మసాలా యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీగా ‘కస్టడీ’ని బైలింగ్వల్ చిత్రంగా రూపొందిస్తున్నాడు వెంకట్ ప్రభు.
కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ ‌లుక్‌తో పాటూ, ఇంతవరకూ రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయ్. ప్రస్తుతం పాటల చిత్రీకరణలో బిజీగా వున్న ఈ చిత్రాన్ని మే 12న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి, సమ్మర్ నాగ చైతన్యకు ఎలా కలిసొస్తుందో.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com