హిజ్ మెజెస్టి సుల్తాన్ తో సమావేశమైన సిరియా అధ్యక్షుడు

- February 21, 2023 , by Maagulf
హిజ్ మెజెస్టి సుల్తాన్ తో సమావేశమైన సిరియా అధ్యక్షుడు

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌ పర్యటనకు వచ్చిన సిరియన్ అరబ్ రిపబ్లిక్ అధ్యక్షుడు డాక్టర్ బషర్ అల్ అసద్‌.. హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ తో సమావేశమయ్యారు. అంతకుముందు సిరియా అధ్యక్షుడితోపాటు అతని సహచరుల బృందానికి రాయల్ ఎయిర్‌పోర్ట్‌లో సుల్తాన్, అతని మంత్రివర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం హిస్ మెజెస్టి సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్, సిరియన్ అరబ్ రిపబ్లిక్ అధ్యక్షుడు డాక్టర్ బషర్ అల్ అసద్ అల్ బరాకా ప్యాలెస్‌లో అధికారిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భూకంపంలో తీవ్రంగా నష్టపోయిన సిరియన్ సోదర ప్రజలకు హిస్ మెజెస్టి ది సుల్తాన్ తన సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఈ ప్రకృతి విపత్తును అధిగమించడానికి ఒమన్ సుల్తానేట్ తన సోదరులకు మద్దతుగా నిలుస్తుందని మెజెస్టి భరోసానిచ్చారు. ఆపత్కాలంలో సిరియన్ అరబ్ రిపబ్లిక్‌తో పాటు నిలబడినందుకు హిస్ మెజెస్టి సుల్తాన్, ఒమానీ ప్రజలకు సిరియన్ అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. భూకంప ప్రభావాలను తగ్గించడంలో దోహదపడిన ఒమానీ సహాయక చర్యలను కూడా ఆయన ప్రశంసించారు. ఉమ్మడి సహకార రంగాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ రంగాలపై ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సిరియన్ అరబ్ రిపబ్లిక్ అధ్యక్షుడు డాక్టర్ బషర్ అల్ అస్సాద్, అతనితో పాటు వచ్చిన ప్రతినిధి బృందం సోమవారం సాయంత్రం ఒమన్ సుల్తానేట్‌కు తన పని పర్యటన ముగించుకుని బయలుదేరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com