ఇద్దరు పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న భారతీయ మహిళ

- February 21, 2023 , by Maagulf
ఇద్దరు పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న భారతీయ మహిళ

కువైట్: ఓ భారతీయ మహిళ ఫిబ్రవరి 19న తన ఇద్దరు పిల్లలను చంపి.. తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కువైట్ లోని ఫహాహీల్‌లో జరిగింది. మృతురాలిని తమిళనాడుకు చెందిన అఖిలా కార్తీగా గుర్తించారు. ఫహాహీల్‌లోని తమ అపార్టుమెంట్ ఆరో అంతస్తు నుంచి దూకే ముందు ఆమె తన ఇద్దరు పిల్లలను(10 సంవత్సరాల కుమారుడు, 12 సంవత్సరాల కుమార్తె) ఊపిరాడక చంపేసిందని పోలీసులు తెలిపారు. ఆమె డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స పొందుతోందని గుర్తించారు. భర్త ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న భర్త వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తలుపు లోపలి నుండి లాక్ చేయబడి ఉండటం, ఎవరూ స్పందించకపోవడంతో పోలీసులు డోర్లను బద్దలు కొట్టి చూడగా.. ఇంట్లో పిల్లలిద్దరూ శవమై పడి ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న అఖిలా కార్తీ, ఆమె భర్త ఇద్దరూ ఇంజనీర్లు. తమిళ అసోసియేషన్ కువైట్‌లో అఖిలా కార్తీ క్రియాశీల సభ్యురాలని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com