బహ్రెయిన్ లో ‘MEOS GEO 2023’ ప్రారంభం
- February 21, 2023
బహ్రెయిన్: సఖిర్‌లోని ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ సెంటర్లో మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ ఫర్ ఆయిల్, గ్యాస్ అండ్ జియోసైన్సెస్ (MEOS GEO 2023) ప్రారంభమైంది. హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా తరపున క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి, ఉప ప్రధాని షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నేతృత్వంలోని సమగ్ర అభివృద్ధి పథంలో చమురు, గ్యాస్ రంగానికి ఉన్న ప్రాముఖ్యతను అబ్దుల్లా అల్ ఖలీఫా వెల్లడించారు. 1979 నుండి ప్రతి రెండు సంవత్సరాలకు బహ్రెయిన్ రాజ్యంలో ఈ ఈవెంట్ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయిల్, గ్యాస్ రంగాల అభివృద్ధికి నోగాహోల్డింగ్ చైర్మన్, హ్యూమైటేరియన్ వర్క్ అండ్ యూత్ అఫైర్స్ కోసం HM కింగ్ ప్రతినిధి, హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని ఆయిల్ అండ్ గ్యాస్ హోల్డింగ్ కంపెనీ (నోగాహోల్డింగ్) కృషిని ఆయన ప్రశంసించారు. 15,000 మందికి పైగా సీనియర్ అధికారులు, ఇంజనీర్లు, నిపుణులు, విద్యావేత్తల భాగస్వామ్యంతో “నేటి వాస్తవాలు... రేపటి శక్తి” అనే నినాదంతో ఈ సంవత్సరం ఈ సదస్సు జరుగుతుంది. చమురు, గ్యాస్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను చర్చించి, పరిష్కారాలను అన్వేషించనున్నారు.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్‌లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









